Gita Acharan |Telugu

యజ్ఞం అనేది త్యాగం లేదా నిష్కామ కర్మలకు ప్రతీక. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రస్తావిస్తూ ‘‘కొందరు యోగులు దేవతల కోసం త్యాగం చేస్తారు. మరి కొందరు త్యాగం అనే భావనను బ్రహ్మం అనే యజ్ఞంలో కర్మను హోమద్రవ్యంగా సమర్పిస్తారు’’ అని చెప్పారు. అవగాహన లేని వ్యక్తి దృష్టిలో జీవించడం అంటే కేవలం తాను పోగు చేసుకున్న వాటిని రక్షించుకోవడం. వస్తువులు, ఆలోచనలు, భావాలను త్యాగం చేయడం జీవితంలో ఆ తదుపరి ఉన్నత దశ. ఇది అహంకార బీజాలను మనసు అనే సారవంతమైన నేల మీద నాటడానికి బదులు... అగ్నికి ఆహుతి ఇవ్వడం లాంటిది. మూడో దశలో ‘అంతా బ్రహ్మమే’ అని గ్రహించి... త్యాగం అనే భావననే త్యాగం చేయడం.

 

మనస్సు మీద ఆధారపడే కర్మయోగి... కర్మకోసం వెతుకుతూ ఉంటాడు. యజ్ఞమే అతనికి మార్గం అని చెప్పవచ్చు. బుద్ధి మీద ఆధారపడే జ్ఞాన యోగి స్వచ్ఛమైన అవగాహన కోసం వెతుకుతూ ‘త్యాగాన్నే త్యాగం’ చేస్తాడు. మొదటిది క్రమానుగతమైతే... రెండోది చాలా పెద్ద ఘటన. కానీ అది అరుదైనది. అయితే ఈ రెండు మార్గాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయి. ఈ వాస్తవికతను ఇంద్రియాల గురించి చెప్పిన సందర్భంలో శ్రీకృష్ణుడు వివరిస్తూ ‘‘కొంతమంది యోగులు శ్రోత్రాది జ్ఞానేంద్రియాలను నిగ్రహం అనే అగ్నికి సమర్పిస్తారు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయాలను ఇంద్రియాలు అనే అగ్నికి అర్పిస్తారు. అంటే యోగులు మనో నిగ్రహం ద్వారా ఇంద్రియాలను అదుపు చేస్తారు. దీని ఫలితంగా శబ్దాది విషయాలు (వినబడడం, కనబడడం లాంటివి) ఎదురుగా ఉన్నా, లేకున్నా వాటి ప్రభావం వారి ఇంద్రియాల మీద ఏమాత్రం ఉండదు’’ అని చెప్పాడు. దీన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే... ఇది త్యాగాన్నే త్యాగం చేసే మార్గం.

 

ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల మధ్య సంబంధం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అనేకసార్లు వివరించాడు. ఇంద్రియాలు తమతమ ఇంద్రియ సంబంధమైన విషయాలతో కలిసినప్పుడు... రాగద్వేషాలు అనే ద్వంద్వాలకు గురి అవుతాయి. ఈ ద్వంద్వాల విషయంలో మనం అప్రమత్తమై ఉండాలి. విశేష కృషితో... కర్మయోగి ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు మధ్య ఉన్న వంతెనను విచ్ఛిన్నం చేస్తాడు. ఇది ‘శ్రోత్రాదీ నింద్రియాణ్యన్యే’ అనే గీతాశ్లోకంలోని మొదటి భాగంలో చెప్పిన త్యాగం. అవగాహన ద్వారా, కేవలం సాక్షిగా మారడం ద్వారా తనను తాను త్యాగం చేసే యోగి గురించి రెండో భాగం వర్ణిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ యోగులు ద్వంద్వాలను అధిగమిస్తారు.


Contact Us

Loading
Your message has been sent. Thank you!