Gita Acharan |Telugu

వివిధ అంశాల ఆధారంగా మనకోసం, మన కుటుంబం కోసం, సమాజం కోసం మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఈ నిర్ణయ సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళాలని చెబుతూ ‘‘యోగః కర్మసు కౌశలం... అంటే యోగస్థితిలో చేసే ప్రతి కర్మ సామరస్యంగా ఉంటుంది’’ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆస్వాదించడం కోసం కర్తృత్వాన్ని, అహంకారాన్ని వదిలెయ్యడం. మనం తీసుకొనే నిర్ణయాలన్నీ మనం, మన కుటుంబం సుఖపడడానికి లేదా బాధను నివారించుకోవడానికి. ఈ ప్రయాణంలో తదుపరి స్థాయి... సమతుల్యమైన నిర్ణయాలను తీసుకోవడం. మనం సంస్థలకు, సమాజానికి బాధ్యత వహిస్తున్న సందర్భాలలోనైనా సరే... ఈ కర్తృత్వం ఇంకా మిగిలే ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు కర్తృత్వానికి తావులేని అంతిమ (అత్యున్నత) స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్థాయికి చేరుకున్న వ్యక్తి ఏది చేసినా... అది సామరస్యంగానే ఉంటుంది. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమే వారిని నడిపిస్తుంది. నిర్ణయాధికారులందరికీ తమ ప్రయాణంలో ఈ దశ ఒక ముఖ్యమైన భాగం. అందుకే ‘యోగః కర్మసు కౌశలం’ అనే వాక్యాన్ని ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌’ (ఐఎఎస్‌) తమ లోగోలో భాగంగా చేసుకుంది.

మనం భావోద్వేగాలు, పక్షపాతాలు, జ్ఞాపకాల ప్రభావంలో పడకుండా ఉండాలి. ఎందుకంటే వాటి ప్రభావంలో పడితే... వాస్తవాలను గ్రహించే మన సామర్థ్యాలను అవి నాశనం చేస్తాయి. తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తాయి. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదో ఒకవైపు మొగ్గు చూపించే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు వీలైనంత త్వరగా తటస్థ దశలోకి రావాల్సిన అవసరం ఉంది. ఏదైనా నిబంధనను కచ్చితంగా అమలు చేయడం, ఏదైనా నిర్ణయం తీసుకోవడం సులువైన, ఆహ్లాదమైన విషయాలు కావు. అప్పుడు తటస్థమైన ఆలోచనే మార్గాన్ని చూపిస్తుంది. ప్రశంసలను, విమర్శలను సమానంగా తీసుకోవడానికి తటస్థ వైఖరి సహాయపడుతుంది. తటస్థ స్థితిలో స్థిరంగా నిలిచినవారికి శక్తి, అపరిమితమైన తెలివితేటలు, కారుణ్య స్వభావం ఉంటాయి. ఇలాంటి గొప్ప గుణాలు కలిగినవారు అన్నింటా కార్యసాధకులు అవుతారు.

 

https://www.andhrajyothy.com/2024/navya/every-action-done-in-yoga-is-harmony-1297383.html


Contact Us

Loading
Your message has been sent. Thank you!