
'అదే అర్జునుడు, అదే బాణం' అనేది ఒక సామెత. సమర్థుడైన వ్యక్తి ఎప్పుడైనా తన కర్మ క్షేత్రంలో విఫలమైనప్పుడు... ఆ స్థితిని వివరించడా నికి దీన్ని ఉపయోగిస్తారు. యోధుడిగా అర్జునుడు ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోలేదు. కానీ అతని జీవి తపు చరమాంకంలో... కొంతమంది కుటుంబ సభ్యు లను బందిపోట్ల సమూహం నుంచి రక్షించడానికి చేసిన చిన్న యుద్ధంలో ఓటమిపాలయ్యాడు. అప్పుడు తన సోదరుడితో 'ఏం జరిగిందో నాకు తెలీదు. నేను అదే అర్జునుణ్ణి. ఇవి కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచిన అవే బాణాలు. కానీ ఈసారి నా బాణాలు లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి. లేదా శక్తిని కోల్పోయాయి" అంటాడు. మనలో ఎవరికైనా ఇలా జరగవచ్చు. ప్రతిభావంతులైన క్రీడాకారులు కొంత కాలం తమ క్రీడా సామర్ధ్యాన్ని (ఫాము) కోల్పోతారు. ఒక నటుడు, గాయకుడు విఫలమవుతారు.
దురదృష్టం, చెడు సమయం లాంటివి వీటికి ఆపా దిస్తూ ఉంటారు. దీనికి శాస్త్రీయమైన వివరణ లేదు. కర్మ కర్మఫలాల మధ్య సంబంధాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తూ దైవం (భగవంతుడి సహకారం/ సంకల్పం / ఆశీస్సులు) కర్మను నెరవేర్చడానికి దోహ దపడే అంశాల్లో ఒకటని తెలిపాడు. "కర్మపై నీకు హక్కు ఉంది కాని కర్మ ఫలం మీద కాదు" అని శ్రీకృ ష్ణుడు చెప్పడానికి కారణం అదే.
హస్తసాముద్రికం, జ్యోతిషం, రాశిఫలాలు చెప్పడం లాంటి విద్యలను కొందరు అభ్యసిస్తారు. కానీ వాటిలో ఏదీ దైవం కాదు. అదే విధంగా దైవాన్ని అంచనా వేయగలిగే శాస్త్రీయ సిద్ధాంతం ఏదీ లేదు. సర్వశక్తి మంతుడు. చేసిన గొప్ప రూపకల్పనలో (సృష్టిలో) మనం నిమి త్రమాత్రులం అనీ, చిన్న తున కలం అనీ శ్రీకృష్ణుడు మనకు గుర్తు చేస్తున్నాడు. విజయం మనలో అహంకారాన్ని పుట్టించక పోతే... వైఫల్యం మనల్ని బాధిం చదు. ఎందుకంటే రెండూ దైవం
కె. శివప్రసాద్