Gita Acharan |Telugu

‘‘‘సత్‌ (వాస్తవమైనది/ సత్యమైనది) ఎన్నటికీ అంతం కాదు, ‘అసత్‌’ (అవాస్తవమైనది/ అసత్యమైనది) అనే దానికి ఎన్నడూ ఉనికి లేదు’’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రెండిటికీ మధ్య తేడాను గుర్తించగలిగినవాడే జ్ఞాని. సత్‌, అసత్‌ల చిక్కుముడులను అర్థం చేసుకోడానికి అనేక సంస్కృతుల్లో తాడు, పాము పోలికను తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. 

ఒక వ్యక్తి చీకటి పడ్డాక ఇంటికి చేరుకున్నాడు. గుమ్మం ముందు అతనికి పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్టు కనిపించింది. నిజానికి అది తాడు. పిల్లలు దానితో ఆడుకొని, అక్కడ వదిలేసి వెళ్ళారు. అది మసక చీకట్లో పాములా అతనికి అనిపించింది. ఇక్కడ తాడు వాస్తవానికీ, పాము అవాస్తవానికీ ప్రతీకలు. అతను ‘అది తాడు’ అనే వాస్తవాన్ని, అంటే సత్‌ను గ్రహించేవరకూ... తను పాము అని ఊహించుకున్న అవాస్తవాన్ని ఎదుర్కోవడానికి అనేక వ్యూహాలను అనుసరించవచ్చు. కర్రతో దాని మీద దాడి చెయ్యవచ్చు. లేదా దాని నుంచి దూరంగా పారిపోవచ్చు. లేదంటే వాస్తవం ఏమిటో తెలుసుకోవడం కోసం... దీపాన్ని వెలిగించి, దాన్ని చూసే ప్రయత్నం చెయ్యవచ్చు. మన అవగాహన అవాస్తవం మీద ఆధారపడినప్పుడు.... అత్యుత్తమమైన వ్యూహాలు, నైపుణ్యాలు నిష్ఫలం అవుతాయి. ఇక్కడ తాడు లేకుండా ‘పాము’ అనే భావన లేదు. అంటే వాస్తవం నుంచి అవాస్తవం తన ఉనికిని పొందుతోంది. పీడకల వచ్చినప్పుడు మన శరీరానికి నిద్రలో చెమట పట్టినట్టు... అది మనల్ని ప్రభావితం చేస్తోంది. 

‘గతంలో లేనిది భవిష్యత్తులో కూడా ఉండదు’ అని తెలుసుకోవడమే అసత్‌ను గుర్తించే పరీక్షా మార్గం అని శ్రీకృష్ణుడు సూచించాడు. ఇంద్రియ ఆనందాన్ని ఉదాహరణగా తీసుకుంటే... అది అంతకుముందు లేదు, కొంతసేపటి తరువాత ఉండదు. నొప్పుల్లాంటి బాధలకూ, అనేక ఇతర అంశాలకూ కూడా ఇది వర్తిస్తుంది. అవాస్తవం కొంత కాలపరిమితికి లోబడి కనిపిస్తుంది. సత్యం... అంటే వాస్తవం ఎల్లప్పుడూ ఉంటుంది. సత్‌ శాశ్వతం, అసత్‌ అనేది అహంకారం. అది అంతర్గతమైన స్వీయ మద్దతుతో తననుతాను నిలబెట్టుకుంటుంది. మన అంతరంగాన్ని (తాడును) గుర్తించిన రోజున, అహంకారం (పాము) దానంతట అదే మాయమైపోతుంది. 


Contact Us

Loading
Your message has been sent. Thank you!