Gita Acharan |Telugu

‘చేసిన పని; విస్మరించిన పని’ అనేది న్యాయ శబ్దావళిలో సాధారణంగా ఉపయోగించే పదబంధం. డ్రైవర్‌ సరైన సమయంలో బ్రేకులు వేయడంలో విఫలమైతే... అది దుర్ఘటనకు దారి తీస్తుంది. ఈ ‘విస్మరించడం’ లేదా ‘అకర్మ’ (క్రియ చేయకపోవడం)... ‘దుర్ఘటన’ అనే కర్మకు కారణమవుతుంది. ఉదాహరణకు ఏదైనా పని చేస్తున్నప్పుడు... మనకు అందుబాటులో ఉన్న అనేక విభిన్నమైన సాధ్య-అసాధ్యాల నుంచి ఒకదాన్ని ఎంచుకుంటాం. అలా వాటిలో ఒకటి ఎంచుకొని అమలు చేసినప్పుడు... మిగిలిన అన్ని సంభావ్యమైన కర్మలు మనకు అకర్మగా మారుతాయి. ప్రతి కర్మలోనూ అకర్మ దాగి ఉన్నదనే నిర్ధారణకు ఇది దారితీస్తుంది. ‘‘కర్మలో అకర్మను, అకర్మలో కర్మను దర్శించేవాడు బుద్ధిశాలి. అతడు యోగి. అతడు సమస్త కర్మలను ఆచరించేవాడు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. క్లిష్టమైన ఈ బోధనను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మనకు సహాయపడతాయి.

 

‘‘కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? ఈ విషయాన్ని నిర్ణయించడంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనవుతున్నారు. తికమక పడుతున్నారు. కాబట్టి ఇది క్లిష్టమైన విషయం’’ అని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. ‘‘కర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. అదే విధంగా అకర్మ స్వరూపాన్ని కూడా గ్రహించాలి. వికర్మ లక్షణాలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే... కర్మతత్త్వం అత్యంత నిగూఢమైనది’’ అని ఆయన వివరించాడు.

 

చింతనాపరుడైన ఒక వ్యక్తి అడవిలోకి ఒక జంతువు పారిపోవడాన్ని గమనించాడు. క్షణకాలం తరువాత ఒక వేటగాడు వచ్చి... ‘‘ఇటుగా ఏదైనా జంతువు వెళ్ళడం మీరు చూశారా?’’ అని అడిగాడు. అబద్ధం చెప్పడం అనైతికం. నిజం చెబితే అది జంతువు మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. అన్ని సంస్కృతులు, మతాలు నిషేధించిన వాటన్నిటినీ జనం పాటిస్తే... వారు జీవించడం అసాధ్యం. కాబట్టే ‘‘ఈ సమస్యలు జటిలమైనవి. వీటి పట్ల విద్వాంసులు కూడా గందరగోళానికి గురవుతారు’’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మనమందరం నివసించే ఈ భౌతిక ప్రపంచంలో... సులభమైన సమాధానాలు లేని, ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి అనేక పరిస్థితులను జీవితం సృష్టిస్తుంది. మనం కర్త నుంచి సాక్షిగా... అంటే చేసేవాడిని నేను కాదనే ఎరుకను పొందే వరకూ పయనించి... ఎలాంటి ఎంపికలూ లేకుండా, అవగాహనతో జీవించినప్పుడు మాత్రమే కర్మతత్త్వం పట్ల స్పష్టత కలుగుతుంది.


Contact Us

Loading
Your message has been sent. Thank you!